ఏపీ నిరుదోగ్యుల‌కు శుభ‌వార్త‌... 1896 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌....

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిరుదోగ్యుల‌కు శుభ‌వార్త‌ను అందించింది. 1896 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. యానిమల్‌ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్‌లో 1896 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేష‌న్‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నవంబర్‌ 20 నుంచి ప్రారంభమ‌వుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. న‌వంబ‌ర్ 20 నుంచి డిసెంబర్‌ 12వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌ల‌ను డిసెంబర్‌ 27న జారీ చేస్తారు. ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్ విధానంలో ప‌రీక్ష ఉంటుంది. డిసెంబర్‌ 31వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించ‌డం జ‌రుగుతుంది. ఈ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన వారికి జనవరిలో నియామక పత్రాలు అందజేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూద్దాం.:

మొత్తం పోస్టులు- 1896

అనంతపురం జిల్లా - 473
చిత్తూరు జిల్లా - 100
కర్నూలు జిల్లా - 252
వైఎస్‌ఆర్‌ కడప జిల్లా - 210
నెల్లూరు జిల్లా - 143
ప్రకాశం జిల్లా - 177
గుంటూరు జిల్లా - 229
కృష్ణా జిల్లా - 120
పశ్చిమ గోదావరి జిల్లా - 102
తూర్పు గోదావరి జిల్లా - 15
విశాఖపట్నం జిల్లా - 28
విజయనగరం జిల్లా - 13
శ్రీకాకుళం జిల్లా - 34

Good News for AP Unemployed... 1896 Govt Jobs Notification....

ఈ ఉద్యోగానికి అప్లయ్‌ చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు జులై 1, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన‌రీ పీరియ‌డ్ ఉంటుంది. ఆ సమయంలో 15 వేల రూపాయ‌ల చొప్పున కన్సాలిడేషన్‌ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 నుంచి రూ.72,810 వరకూ జీతం ఉంటుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. ఆన్‌లైన్‌ విధానంలో మాత్ర‌మే అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభమ‌య్యేది : నవంబర్‌ 20, 2023
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరితేదీ : డిసెంబర్‌ 10, 2023
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 11, 2023
హాల్‌టికెట్లు విడుదల : డిసెంబర్‌ 27, 2023
పరీక్ష తేదీ : డిసెంబర్‌ 31, 2023

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+