నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా పెరిగిన అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు..
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. గత జనవరిలో వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్పడు మొత్తం 5,696 ఖాళీలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అయితే, ఇప్పడు తాజాగా ఆ ఖాళీలను పెంచుతూ ఆర్‌ఆర్‌బీ భోపాల్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 18,799 ఏఎల్‌పీ పోస్టులు భర్తీ కానున్నాయి..
దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా మొత్తం 18,799 ఏఎల్‌పీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో1,364 పోస్టులు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో జోన్ల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ భోపాల్ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ విషయంలో తదుపరి నోటీసుల కోసం వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని కోరింది.

సౌత్‌సెంట్రల్‌లో అధికంగా పెరిగిన పోస్టులు..
రైల్వేశాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి గత జనవరిలో 5,696 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 20 నుంచి ఫిభ్రవరి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించారు. ఇక, తాజాగా ఈ పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే పోస్టుల సంఖ్య 585 నుంచి 1949కి పెరగగా, సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే పోస్టుల సంఖ్య 1192 నుంచి 3973 కి చేరింది. ఇక సౌత్ ఈస్టర్న్ రైల్వే పోస్టుల సంఖ్య 300 నుంచి 1001కి పెరిగింది. ఇక సదరన్ రైల్వే పోస్టుల సంఖ్య 218 నుంచి 726కి పెరిగింది. సౌత్ వెస్టర్న్ రైల్వే పోస్టుల సంఖ్య 473 నుంచి 1576కి పెరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 వేతనం ఉంటుంది.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications