Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అగ్నిపథ్ పథకానికి వెల్లువలా దరఖాస్తులు: ఆరు రోజుల్లో ఐఏఎఫ్‌కు 2 లక్షలు

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌' పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా భారత వాయుసేనలో (ఇండియన్ ఎయిర్ ఫోర్స్​) నియామకాల కోసం జూన్‌ 24న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, మొదటి ఆరు రోజుల వ్యవధిలోనే లక్షా 83 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుందని.. ఆసక్తి గల అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల సంఖ్య రోజు రోజుకు భారీగా వస్తోంది.

IAF receives over 2 lakh applications under Agnipath scheme in 6 days

కాగా, త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగానూ 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ ​14న ప్రకటించింది. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది.

కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది (2022) రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. దీంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగానూ మారిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు రాజకీయ పార్టీలు కూడా నిరసనలు చేపడుతున్నాయి. అయితే, కేంద్రం, త్రివిధ దళాల అధికారులు మాత్రం అగ్నిపథ్ పథకంపై వెనక్కి తగ్గేది లేదని ఇప్పటకే స్పష్టం చేశారు. అంతేగాక, వరుసగా అగ్నిపథ్ పథకం కింద భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+