AIR FORCE JOBS : ఇంటర్ అర్హతతో "అగ్నివీర్ వాయు" ఉద్యోగాలు !!
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గుడ్ న్యూస్ ప్రకటించింది. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు (1/2027) బ్యాచ్ నియామకాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ సేవ చేయాలనే అవివాహిత పురుషులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఏఎఫ్ ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ఫిబ్రవరి 1, 2026 తుది గడువుగా అని స్పష్టం చేసింది.
విద్యార్హత..
ఈ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్ వృత్తిపర కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు, అలాగే ఇంగ్లిష్‌లో కూడా కనీస మార్కులు ఉండాలి.

ప్రత్యామ్నాయంగా, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులుగా పరిగణించబడతారు.
వయోపరిమితి & శారీరక ప్రమాణాలు..
అభ్యర్థులు జనవరి 1, 2006 నుంచి జూలై 1, 2009 మధ్య జన్మించి ఉండాలి. ఐఏఎఫ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎత్తు, బరువు, ఛాతీ విస్తీర్ణం, శారీరక సామర్థ్య ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. పురుషులు, మహిళల కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుము..
ఈ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.550 తో పాటు జీఎస్‌టీ కలిపి దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత మాత్రమే దరఖాస్తు ప్రక్రియ పూర్తైనట్లు పరిగణిస్తారు.
ఎంపిక ప్రక్రియ..
అగ్నివీర్ వాయు నియామకాలకు మూడు దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- మొదటి దశలో మార్చి 30 మరియు 31 తేదీలలో ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అభ్యర్థుల అకాడమిక్ పరిజ్ఞానం, లాజికల్ అబిలిటీని పరీక్షిస్తారు.
- రెండవ దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)తో పాటు అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 నిర్వహిస్తారు.
- చివరి దశలో మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది.
యువతకు స్వర్ణావకాశం..
కాగా అగ్నిపథ్ పథకం ద్వారా యువతకు దేశ రక్షణలో భాగస్వాములు కావడంతో పాటు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. నాలుగేళ్ల సేవ అనంతరం అగ్నివీర్లకు ఆర్థిక భద్రతతో పాటు భవిష్యత్తు కెరీర్‌కు దోహదపడే అవకాశాలు కల్పించబడతాయి.
దేశానికి సేవ చేయాలనే సంకల్పం ఉన్న యువతకు అగ్నివీర్ వాయు (1/2027) నియామకాలు ఒక అరుదైన, గౌరవప్రదమైన అవకాశంగా నిలవనున్నాయి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications