JEE Mains Result 2024 : జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల విడుదల- స్కోరు కార్డు ఇలా చెక్ చేసుకోండి..
ఈ ఏడాది బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. జేఈఈ బీఆర్క్ (పేపర్2ఏ), బీ ప్లానింగ్ (పేపర్ 2బీ), బీఆర్క్, మరియు బీప్లానింగ్ (2ఏ మరియు 2బీ)కి హాజరైన అభ్యర్ధులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు వీలుగా ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ లో వీటిని ఉంచారు. అలాగే ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా ఎన్టీఏ వెల్లడించింది.
ఈ ఏడాది జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 55 వేల మంది 544 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాశారు. ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ ఎన్టీఏ విడుదల చేసింది. తమ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.ac.in.లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. వెబ్ సైట్ లోకి వెళ్లాక పేపర్ 2 ఫలితాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీని ఎంటర్ చేస్తే ఫలితాలు ఓపెన్ అవుతాయి.

ఈసారి ఎన్టీఏ జేఈఈ మెయిన్ పరీక్షను అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ సహా 13 భాషలలో నిర్వహించింది. ఈ పరీక్షలో సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి మైనస్ 1 మార్కు కేటాయించారు. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైనవి ఉన్నా, నాలుగు ఆప్షన్లు సరైనవి ఉన్నా వాటిని మార్క్ చేసిన వారికి నాలుగు మార్కులు ఇస్తారు. అలాగే పరీక్షా ఫలితాలను తిరిగి మూల్యాంకనం చేయడం కానీ, తిరిగి పరీశీలించడం కానీ చేయరు.












Click it and Unblock the Notifications