Job Notification: సెంట్రల్‌వేర్ హౌజింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు-పూర్తి వివరాలు..!!
ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజినీర్, సూపరింటెండెంట్‌తో పాటు ఇతర పోస్టులను కూడా భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇక పోస్టుల వివరాల విషయానికొస్తే మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్) 40 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్)13 పోస్టులు, అకౌంటెంట్ 9 పోస్టులు, సూపరింటెండెంట్ 24 పోస్టులు,జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 93 పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు కింది విధంగా ఉన్నాయి.

*మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్) - సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ/ఎంబీఏ
* మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) - పీజీ (ఎంటమాలజీ లేదా మైక్రో బయాలజీ లేదా బయో కెమిస్ట్రీ)
* అకౌంటెంట్ - బీకాం లేదా కామర్స్‌లో బీఏ లేదా చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్స్ అండ్ వర్క్స్/ఎస్ఏఎస్ అకౌంటెంట్స్
* జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - డిగ్రీ (అగ్రికల్చర్/జూవాలజీ/కెమిస్ట్రీ/బయో కెమిస్ట్రీ)
ఇక ఈ పోస్టులన్నిటికీ ఉండాల్సిన వయస్సు 28 నుంచి 30 ఏళ్లు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1350/- ఉండగా, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.500. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు మరియు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 12 జనవరి 2025
పరీక్షకు పదిరోజుల ముందు అడ్మిట్ కార్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వేతనం వివరాలు:
*మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్) - రూ.60000-180000/-
* మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) - రూ.60000-180000/-
* అకౌంటెంట్ -రూ.40000-140000/-
* సూపరింటెండెంట్ - 40000-140000
* జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - రూ.29000-93000/-
ఇందులో కొన్ని పోస్టులకు ఆన్‌లైన్ టెస్టు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉండగా మరికొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించి ఆ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష మొత్తం 2 గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది. 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఫ్రొఫెషనల్ నాలెడ్జ్‌కు 100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌కు 20 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌లకు 25 మార్కులు డేటా అనాలిసిస్ ఇంటర్‌ప్రెటేషన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లకు 30 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానంకు 1/4 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ : https://www.cewacor.nic.in/ సందర్శించండి.












Click it and Unblock the Notifications