లక్షకు పైగా జీతంతో LICలో ఉద్యోగాలు..!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గుడ్ న్యూస్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 పోస్టులను భర్తీ చేయనున్నారు.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..
- ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 51
- ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 22
- ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 88
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 38
- జనరల్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 142

అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి..
- అభ్యర్థుల వయసు 2025 ఆగస్టు 1 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు:
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు
దరఖాస్తు ప్రక్రియ..
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 8, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు..
జనరల్ అభ్యర్థులు: రూ.700
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు: రూ.85 (ఇంటిమేషన్ ఛార్జ్)
ఎంపిక విధానం..
తుది ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది:
- ప్రిలిమినరీ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- ఇంటర్వ్యూ
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం..
ఎంపికైన వారికి నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకు జీతం చెల్లిస్తారు.
పరీక్ష తేదీలు..
ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 3, 2025
మెయిన్స్ పరీక్ష: నవంబర్ 8, 2025
ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications