కేంద్రీయ విద్యాలయాల్లో సీటు కావాలా? అప్లికేషన్ నింపేటప్పుడు జాగ్రత్త
దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి, బాలవాటిక ప్రవేశాల నగారా మోగిన సంగతి మనందరికి తెలిసిందే. మార్చి 20 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ.. మరి కొద్ది రోజుల్లో అంటే.. ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్ విధానంలో సాగనుంది.
అయితే, "ఆశ ఎక్కువ.. హడావుడి మరీ ఎక్కువ" అన్నట్లుగా చాలామంది తల్లిదండ్రులు అప్లికేషన్ నింపేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు చివరకు సీటు రాకుండా చేస్తున్నాయి. కేవీఎస్ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి కాబట్టి, దరఖాస్తు చేసేముందు ఈ 'డేంజర్ జోన్'లను ఒక్కసారి పరిశీలించండి.
1. వయస్సు లెక్కల్లో 'పప్పులో కాలేయకండి'!
కేవీఎస్ నిబంధనల ప్రకారం ఒకటో తరగతిలో చేరాలంటే మార్చి 31, 2026 నాటికి ఖచ్చితంగా 6 ఏళ్లు నిండి ఉండాలి. ఒక్క రోజు తక్కువగా ఉన్నా కంప్యూటర్ సిస్టమ్ ఆ దరఖాస్తును తిరస్కరిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని లేదా స్కూలుకు పంపడం ఆలస్యమైందని వయస్సును అటు ఇటుగా మారుస్తుంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో డేట్ ఆఫ్ బర్త్ (DOB) మ్యాచ్ కాకపోతే, లాటరీలో సీటు వచ్చినా నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేస్తారు.

2. 'దూరం' భారమైతే సీటు దూరం!
ఆర్టీఈ (RTE) కోటా కింద దరఖాస్తు చేసేవారికి నివాసం నుంచి పాఠశాలకు ఉన్న దూరం అత్యంత కీలకం. పట్టణ ప్రాంతాల్లో అయితే 5 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల పరిధిలోపు ఉండాలి. "అంత దూరం ఎవరు కొలుస్తారులే" అని తప్పుడు కిలోమీటర్లు నమోదు చేస్తే చిక్కుల్లో పడతారు. స్కూల్ యాజమాన్యం గూగుల్ మ్యాప్స్ లేదా ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా దూరాన్ని లెక్కిస్తుంది. ఈ విషయంలో తేడా వస్తే అడ్మిషన్ పొందే అర్హతను కోల్పోతారు.
3. సర్వీస్ సర్టిఫికేట్లలో 'సవాలక్ష' తప్పులు!
ప్రభుత్వ ఉద్యోగులకు కేవీఎస్ లో ప్రాధాన్యత ఉంటుంది. అయితే, గత 7 ఏళ్లలో ఎన్నిసార్లు బదిలీలు (Transfers) అయ్యాయనే వివరాలను తప్పుగా నమోదు చేస్తుంటారు. ఎక్కువ బదిలీలు ఉంటే సీటు వచ్చే అవకాశం పెరుగుతుందని భావించి అబద్ధపు వివరాలు ఇస్తే.. ఆ తర్వాత మీ ఆఫీస్ నుంచి వచ్చే ధ్రువీకరణ పత్రంతో అవి సరిపోకపోతే జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే సర్వీస్ రికార్డును పక్కన పెట్టుకుని వివరాలు నింపాలి.
4. ఒకే స్కూల్ కు రెండు అప్లికేషన్లు - 'సెల్ఫ్ గోల్'!
"ఒక అప్లికేషన్ కాకపోతే ఇంకోటి తగులుతుందిలే" అని ఒకే పాఠశాలకు ఒకే విద్యార్థి పేరుతో రెండు దరఖాస్తులు సమర్పిస్తే, ఆ రెండు దరఖాస్తులనూ సిస్టమ్ ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తుంది. మీరు కేవలం మూడు వేర్వేరు కేంద్రీయ విద్యాలయాలకు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది. కానీ, ఒకే స్కూల్ కు రెండు సార్లు ప్రయత్నిస్తే మాత్రం మీ పిల్లల సీటుకు మీరే గండి కొట్టుకున్నట్లవుతుంది.
5. కేటగిరీ ఎంపికలో గందరగోళం
ఓబీసీ (నాన్-క్రీమీలేయర్), ఎస్సీ, ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీలను ఎంచుకునేటప్పుడు సరైన సర్టిఫికేట్లు చేతిలో ఉండాలి. "అడ్మిషన్ వచ్చాక సర్టిఫికేట్ చేయించుకోవచ్చులే" అని అనుకుంటే పొరపాటే. దరఖాస్తు చేసే సమయానికే వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికేట్ నంబర్ అవసరమవుతుంది. తప్పుడు కేటగిరీ ఎంచుకుని సీటు సాధించినా, తర్వాత అసలు పత్రాలు చూపించలేకపోతే ఆ సీటును వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారికి ఇచ్చేస్తారు.
తల్లిదండ్రులకు సూచన..
"నిమ్మకు నీరెత్తినట్లు" ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆగకుండా ముందే దరఖాస్తు చేసుకోండి. ఆఖరి నిమిషంలో సర్వర్ మొరాయిస్తే ఆందోళన చెందాల్సి వస్తుంది. నిదానమే ప్రధానం.. కానీ సరైన వివరాలే మీ పిల్లల భవిష్యత్తుకు ప్రాణం!
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications