ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!
ప్రస్తుతం సైన్స్ గ్రూపుల్లో ఇంటర్ చదువుతున్న ఏ విద్యార్ధిని అడిగినా ఐఐటీ లేదా నీట్ పరీక్షలే టార్గెట్ అంటున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు కూడా వీరి నుంచి లక్షలు దండుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల విద్యార్ధులకు నీట్, ఐఐటీ పరీక్షలకు శిక్షణ అందించేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (nara lokesh) ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో లోకేష్ పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఆదేశించారు. ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కెజిబివిల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ దాదాపు 70శాతానికిపైగా పూర్తయిందని, ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండరు ప్రారంభమైందని, 6వతేదీ నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దీంతో ఇంటర్ లో ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత టెక్ట్స్ బుక్స్ 19నాటికి పంపిణీ చేస్తామన్నారు.

అలాగే స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ద్వారా ఇప్పటివరకు 1,95,078మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఆ శాఖ డైరక్టర్ గణేష్ కుమార్ మంత్రి లోకేష్ కు తెలిపారు. ఇప్పటివరకు తమ శాఖ ద్వారా 6.87లక్షలమందికి నైపుణ్య శిక్షణ అందించామన్నారు. ప్రస్తుతం 71,193మంది శిక్షణలో ఉన్నట్లు చెప్పారు. 26రంగాల పూర్తిస్థాయి సమాచారంతో నైపుణ్యం పోర్టల్ సిద్దంచేశారు. నిర్మాణ రంగంలో జాబ్స్ కు సంబంధించి ఈనెల 3వవారంలో 50 జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో అమరావతిలో వర్క్ షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధంగా ఉన్న 87వేలమంది నిర్మాణ కార్మికులకు జాయింట్ సర్టిఫికేషన్, ప్లేస్ మెంట్ పై వర్క్ షాపులో ఎంఓయులు కుదుర్చుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications