NTPCREL: 83 వేల జీతంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
ఎన్‌టీపీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 63 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మార్చి 21.2024 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు 13-04-2024 చివరితేదిగా నిర్ణయించడమైనది.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఇంజినీర్ (ఆర్ఈ-సివిల్): 20 పోస్టులు
ఇంజినీర్ (ఆర్‌ఈ-ఎలక్ట్రానికల్): 29 పోస్టులు
ఇంజినీర్ (ఆర్‌ఈ-మెకానికల్): 09 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ (ఆర్ఈ-హెచ్‌ఆర్): 01 పోస్టు
ఇంజినీర్ (ఆర్‌ఈ-సీడిఎం): 01 పోస్టు
ఎగ్జిక్యూటివ్ (ఆర్ఈ-పైనాన్స్): 01 పోస్టు
ఇంజినీర్ (ఆర్ఈ-ఐటీ): 01 పోస్టు
ఎగ్జిక్యూటివ్ (ఆర్‌ఈ-కార్పొరేట్ కమ్యూనికేషన్): 01 పోస్టు

మొత్తం ఖాళీలు: 63.
విద్యార్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.
వయోపరిమితి: 30 ఏళ్లు మించరాదు.
శాలరీ: ఈ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ.83,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునేవారు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 21-03-2024 తేదీ నుంచి మొదలువుతుంది.
దరఖాస్తుకు చివరి తేదీ 13-04-2024గా నిర్ణయించడమైనది.












Click it and Unblock the Notifications