నెలకు రూ.70 వేల జీతంతో ఉద్యోగాలు... నో ఎగ్జామ్ & రేపే ఇంటర్వ్యూ !!

భారతదేశంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) తీపి కబురు ప్రకటించింది. కెమిస్ట్ (Chemist) పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 8 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనుండగా, ఈ ఉద్యోగాలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70,000 వరకు గౌరవ వేతనం అందించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం పొందాలనుకునే యువతకు ఇది అరుదైన అవకాశంగా చెప్పవచ్చు.

ప్రభుత్వ రంగ సంస్థలో మంచి జీతంతో కెమిస్ట్రీ విభాగంలో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇచ్చిన ఈ అవకాశం ఎంతో కీలకం. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరగడం వల్ల అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు www.oil-india.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

oil-india-limited-notification-for-chemist-jobs-with-huge-salary

ఖాళీల వివరాలు..

పోస్టు పేరు :

కెమిస్ట్ (Chemist)

మొత్తం ఉద్యోగాలు :

8

( కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం జరగనుంది )

అర్హతలు & విద్యార్హత..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి M.Sc (Chemistry) పూర్తి చేసి ఉండాలి. కెమిస్ట్రీ సంబంధిత పరిశ్రమల్లో పని అనుభవం ఉన్న వారికి అదనపు ప్రాధాన్యత ఇవ్వనున్నారు

ల్యాబ్ వర్క్, క్వాలిటీ కంట్రోల్, అనాలిసిస్ వంటి రంగాల్లో అనుభవం ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

వయోపరిమితి..

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది

ఎంపిక విధానం..

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు

పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేపడతారు

ఇంటర్వ్యూ వివరాలు..

ఇంటర్వ్యూ విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ తేదీ: జనవరి 7, 2026

ఇంటర్వ్యూ వేదిక వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు

తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..

ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, అనుభవ ధృవీకరణ పత్రాలు, ఆధార్ / ఐడీ ప్రూఫ్, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, బయోడేటా (రెజ్యూమ్) తీసుకురావాలని కంపెనీ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+