విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 1201 ఉద్యోగాల కోసం వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాల నియామకాలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్పీడీసీఎల్‌లో 70 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, మరో 1201 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
వీటిలో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు 1000 ఉండగా, సబ్‌ ఇంజినీర్‌ పోస్టులు 201 ఉన్నాయి. వీటి దరఖాస్తులు మే 19న, జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.

19 నుంచి జూనియర్‌ లైన్‌మెన్‌ దరఖాస్తులు:

జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా, మే 19 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. జులై 17న పరీక్ష నిర్వహిస్తారు.

spdcl releases notification for 1201 JL, sub engineer recruitment

మొత్తం పోస్టులు: 1000
లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ 553, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ 447 చొప్పున ఉన్నాయి.

అర్హతలు:
పదో తరగతి ఉత్తీర్ణులై ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు పాసవ్వాలి.

వయో పరిమితి:
2022, జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.200, పరీక్ష ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవరసం లేదు.

దరఖాస్తులు ప్రారంభం: మే 19
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 8
హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్‌: జూన్‌ 11
రాతపరీక్ష: జూన్‌ 17
సంప్రదించాల్సిన వెబ్‌సైట్‌: http://tssouthernpower.cgg.gov.in

జూన్ 15 నుంచి సబ్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తులు:

201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఎస్పీడీసీఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జూన్‌ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 31న రాత పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం పోస్టులు: 201
ఇందులో లిమిటెట్‌ రిక్రూట్‌మెంట్‌ 19, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ 182 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా గానీ, డిగ్రీగాని చేసి ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్థులు 2022, జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.200, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 15
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 5
హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్‌: జూలై 23
రాతపరీక్ష: జూలై 31
సంప్రదించాల్సిన వెబ్‌సైట్‌: http://tssouthernpower.cgg.gov.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+