SBI jobs:డిగ్రీ పూర్తి చేశారా.. అయితే వెంటనే ఈ జాబ్‌కు అప్లయ్ చేయండి..!!
ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) విభాగంలో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పోస్టుల వివరాలు అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ ముగింపు తేదీలు, దరఖాస్తు ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.
అర్హతలు
ఎస్‌బీఐలో క్లరికల్ క్యాడర్‌లో జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అయితే 31 డిసెంబర్,2024 నాటికి ఈ డిగ్రీ పూర్తయి ఉండాలి. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థుల వయసు విషయానికొస్తే కనీస వయసు 20 ఏళ్లు గరిష్ట వయసు 28 ఏళ్లుగా నిర్ణయించారు. అంటే అభ్యర్థి 2 ఏప్రిల్ 1996 కంటే ముందు జన్మించి ఉండకూడదు. అలానే 1 ఏప్రిల్ 2004 తర్వాత జన్మించి ఉండకూడదని నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. ఇక రిజర్వేషన్ల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు వివరాలు:
అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750గా దరఖాస్తు ఫీజు నిర్ణయించడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.ఇక అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.
ముఖ్య తేదీలు:
అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇంకా ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ 7 డిసెంబర్ 2024 కాగా చివరి తేదీ 27 డిసెంబర్ 2024గా పేర్కొన్నారు. ఇక ప్రిలిమినరీ పరీక్ష జనవరి 2025లో ఉండే అవకాశం ఉంది. ఇది పూర్తిగా నిర్థారించబడలేదు. మెయిని పరీక్ష ఫిబ్రవరి 2025లో ఉండే అవకాశం ఉంది.
పరీక్ష విషయానికొస్తే ప్రిలిమినరి పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందుకు 100 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఒక గంటలో ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌నుంచి 30 ప్రశ్నలు, న్యూమరికల్ అబిలిటీ నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్ అబిలిటీ నుంచి 35 ప్రశ్నలు మొత్తంగా 100 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానంకు 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ క్లియర్ చేసిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో 190 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులు కేటాయించారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సమయం 2 గంటల 40 నిమిషాలు. జనరల్ /ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు,జనరల్ ఇంగ్లీషు నుంచి 40 ప్రశ్నలు,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు,రీజనింగ్ అబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు మొత్తంగా 190 ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఇందులో కూడా 0.25తో నెగిటివ్ మార్కులు ఉంటాయి.












Click it and Unblock the Notifications