నేటి నుంచే తెలంగాణ ఐసెట్ 2024 కౌన్స్‌లింగ్ ప్రారంభం...
నేటి నుంచే తెలంగాణ ఐసెట్ - 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ షూరు కానుంది. అర్హులైన అభ్యర్థులు ఆదివారం నుంచి ఆన్ లైన్‌లో కౌన్స్‌లింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగలరని అధికారులు సూచిస్తున్నారు. ఐసెట్ కౌన్సిలింగ్‌కు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేది వరకు వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/ ను సంప్రదించగలరు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి ప్రతి ఏటా ఐసెట్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ ఏడాది కూడా ఈ విద్యాసంవత్సరానికి గాను కాకతీయ వర్శిటీ ఆధ్వర్యంలో ఐసెట్ ప్రవేశ పరీక్షలు జరిగాయి. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5, 6 తేదీల్లో పలు సెషన్లల్లో నిర్వహించారు. ఐసెట్ పరీక్ష కోసం 86156 మంది దరఖాస్తు చేసుకోగా, 77942 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు సాధించారు.

ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. ఇక, తాజాగా దీని కౌన్సెలింగ్ లో భాగంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతో పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు త్వరలోనే వెలువడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఏడాది ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ 2 విడతల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17తో ఈ ప్రక్రియ ముగియనుంది. సెప్టెంబర్ 4వ తేది నుంచి 11వరకు వెబ్‌ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications