TG SET 2024 : నేడు తెలంగాణ సెట్ 2024 అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌..

తెలంగాణ సెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. నేడు హాల్‌టిక్కెట్లు విడుద‌ల కానున్నాయి. టీజీ సెట్ 2024 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డుల‌ను అధికారులు సోమవారం విడుదల చేయనున్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు తెలంగాణ సెట్ అఫీషియల్ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవగ‌ల‌రని అధికారులు చెబుతున్నారు. అభ్య‌ర్థులు తెలంగాణ సెట్ అధికారిక వెబ్ సైట్ http://telanganaset.org/ ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

ఇటీవ‌లే తెలంగాణ సెట్ ( 2024) పరీక్షల షెడ్యూల్‌లో ప‌లు మార్పులు జ‌రిగాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో పరీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉంది. యూజీసీ నెట్ పరీక్షల క్ర‌మంలో ఆ పరీక్షల తేదీలను అధికారులు మార్చారు. కొత్త తేదీలను ఇటీవలే ప్రకటించారు. కొత్త షెడ్యూల్ ప్ర‌కారం.. దరఖాస్తుల ఎడిట్‌కు ఆగస్టు 23, 24వ తేదీ వరకు అధికారులు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అంటే నేటి నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త తేదీల ప్ర‌కారం.. సెప్టెంబర్ 10, 11, 12, 13 తేదీల్లో టీజీ సెట్ పరీక్షలు జరగనున్నాయి.

TGSET 2024 Telangana SET 2024 Admit Cards Released Today

ప‌రీక్ష విధానం...

తెలంగాణ సెట్ 2024 ప‌రీక్ష మొత్తం రెండు పేప‌ర్ల‌లో ఉంటుంది. పేప‌ర్-1 లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు ఉంటాయి. పేప‌ర్-2 లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులు ఉండనున్నాయి. సిబిటి విధానంలో ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. మూడు గంటల పాటు ప‌రీక్ష ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పేప‌ర్ 1లో బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. పేప‌ర్ 2లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ప్ర‌శ్న‌లు అడుగ‌తారు. పేపర్-1 అంద‌రికీ కామ‌న్‌గా ఉంటుంది.

జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. పేపర్ - 2 అనేది అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై రాసుకోవాలి. ఇందులో ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, హిస్టరీ, లా , జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+