TS DSC 2024: తెలంగాణలో మెగా డీఎస్సీ ప్రకటన- 11వేల పోస్టుల భర్తీ-కేటగిరీ వారీగా ఇలా..

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో వివిధ కేటగిరీల కింద పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో అన్ని వివరాలను పొందు పర్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను తాజాగా రద్దు చేసిన ప్రభుత్వం.. అప్ గ్రేడ్ చేసి దీన్ని విడుదల చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11062 పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన 5089 పోస్టులకు కొత్తగా 5973 పోస్టులు కలిపి మొత్తం 11062 పోస్టులకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ts DSC 2024 notification released- here are important dates, other details

ఇందులో ఎస్జీటీ పోస్టులు 6508 ఉన్నాయి. ఎస్జీటీ స్పెషల్ ఎడుకేషన్ పోస్టులు 796 ఉన్నాయి. భాషా పండిట్ల పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 220 కూడా ఇచ్చారు.

నిన్న ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకూ డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షల తేదీల్ని త్వరలో ప్రకటిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+