TS EAMCET Key 2024 : టిఎస్ ఎంసెట్ ప్రాథ‌మిక కీ విడుద‌ల‌..

టిఎస్ ఎంసెట్ ప్రాథ‌మిక కీ విడుద‌ల‌య్యింది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 పరీక్షలు నిన్న‌టితో (మే 11) ముగిశాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన టిఎస్ ఎంసెట్ ప‌రీక్ష‌లు నిన్న‌టితో ముగిసాయి. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ప్రిలిమ‌న‌రీ కీని విడుద‌ల చేసారు. అభ్య‌ర్థులు ప్రాథమిక కీను చూసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను https://eapcet.tsche.ac.in/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు.

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ బాధ్యత జెఎన్‌టీయూ హైద‌రాబాద్ తీసుకుంది. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో ప్రవేశాలకు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 7, 8వ తేదీల్లో పరీక్షలు జ‌రిగాయి. ఇక‌, ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ ప‌రీక్ష‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

TS EAMCET Key 2024 Release of TS EAMCET Primary Key

విద్యార్థులకు ప్రాథమికీ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల‌ 13వ తేదీలోపు తెలిపేందుకు అవ‌కాశం ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథ‌మిక కీను నేడు (మే 12) విడుదల చేయనున్నారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు నేడు అందుబాటులోకి రానున్నాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప‌రీక్ష‌కు సంబంధించిన ప్రాథమిక కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 14వ తేదీ ఉదయం 10 గంటలలోపు తెలియజేయవచ్చు.

ఇక, ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తుది ఫ‌లితాలు ఈనెల 25న విడుదలయ్యే అవకాశం ఉంది. 2024-2025 విద్యాసంవత్సరానికి తెలంగాణలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ఎంసెట్‌ 2024 ప‌రీక్ష‌ను నిర్వహించారు. ఇక‌, ఈ ఏడాది ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ పరీక్షలకు 2,54,543 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలకు మొత్తం 1,00,260 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+