జెన్‌కో రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల: 17న పరీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(TS Genco)లో ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగాల నియామక రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శుక్రవారం విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్‌ లేదా మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. డిసెంబర్‌ 17వ తేదీన ఓఎంఆర్‌ షీట్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో రాత పరీక్ష జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు జెన్‌కో సంస్థ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే.

tsgenco released hall tickets for written exam of 339 assistant, engineer 60 chemist posts

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు జెన్‌కో సంస్థ వెల్లడించింది.

జెన్‌కో రాత పరీక్ష హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ క్లిక్‌ చేయండి

యూపీఎస్సీ ఫలితాలు విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్-2023 ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (upsc.gov.in)లో ఫలితాలు చూసుకోవచ్చు. తమ అడ్మిట్ కార్డు నెంబరు ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చూసుకోవడంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి 24 వరకు నిర్వహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల కోసం దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. యూపీఎస్సీ త్వరలోనే ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+