UPSC CSE Mains 2026 Results: సివిల్స్ ఫలితాలు విడుదల- ఇంటర్వూలకు 2526 మంది ఎంపిక..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను (UPSC CSE Mains 2026 Results) ఇవాళ విడుదల చేశారు. ఇందులో 2526 మంది ఇంటర్వూలకు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఫలితాలు తెలుసుకునేందుకు అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పూర్తి వివరాలను యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది.
ఇవాళ విడుదలైన యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలను తెలుసుకునేందుకు ముందుగా అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ Written Results విభాగంపై క్లిక్ చేయాలి. అనంతరం 'Civil Services (Main) Examination, 2026' అనే లింక్ ఉంటుంది. అక్కడ ఫలితాల పీడీఎఫ్ ఫైల్‌ను ఓపెన్ చేయాలి. ఇందులో సెర్చ్ ఆప్షన్‌ను ఉపయోగించి రోల్ నంబర్‌ను సరిచూసుకోవాలి. ఎంపికైన అభ్యర్దులకు న్యూఢిల్లీలోని షాజహాన్ రోడ్ ధోల్పూర్ హౌస్‌లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన వారికి సంబంధించిన ఈ-సమన్ లెటర్లు యూపీఎస్సీ వెబ్‌సైట్, ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఫిజికల్ లెటర్లు మాత్రం పంపరు. పర్సనాలిటీ టెస్టులు పూర్తయి, తుది ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోపు అభ్యర్థులందరి మార్కు షీట్లు కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇవి 30 రోజుల పాటు అందుబాటులో ఉంచుతారు.
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్ధులు ఆన్ లైన్లో ఉండే దరఖాస్తు ఫారమ్ లో అవసరమైన వివరాలు నింపాల్సి ఉంటుంది. లేదా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకూ యూపీఎస్సీ వెబ్ సైట్ upsc.gov.in లో అందుబాటులో ఉంచుతారు. వాటిని భర్తీ చేయడం ద్వారా అభ్యర్ధులకు ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకున్నట్లు అవుతుంది.
ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 21 నుండి 30 వరకు జరిగాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో 2526 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించినట్లు ఇవాళ యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వీసుల ఖాళీల ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తారు.












Click it and Unblock the Notifications
