Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IDBI recruitment: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.idbibank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి జూన్ 20 వరకు గడువు ఉంది.

ఐడీబీఐ రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు:
136 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఖాళీ వివరాలు:
మేనేజర్: 84

అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 46

డిప్యూటీ జనరల్ మేనేజర్: 6

 IDBI recruitment:

దరఖాస్తు రుసుము:
జనరల్, EWS & OBC వర్గాలకు దరఖాస్తు రుసుము రూ. 1000. SC/ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 200.

IDBI రిక్రూట్‌మెంట్ 2023: ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

idbibank.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

'రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ - 2023-24 (ఫేజ్ II)' కింద అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

నమోదు చేసుకోండి, దరఖాస్తు ప్రక్రియతో కొనసాగండి

ఫారమ్‌ను పూరించండి, రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి

భవిష్యత్తు సూచన కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి

దరఖాస్తు చేసుకోవడానికి ఐడీబీఐ రిక్రూట్‌మెంట్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లి చేయండి. https://ibpsonline.ibps.in/idbiscomar23/

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 240 ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) పలు ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకులోని 240 ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 మే 2023న ప్రారంభమైంది. 11 జూన్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక కోసం జులై 2న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

పోలీసుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 240
ఆఫీసర్ క్రెడిట్: 200
ఆఫీసర్ ఇండస్ట్రీ: 08
ఆఫీసర్ సివిల్ ఇంజినీర్: 05
ఆఫీసర్ ఎలక్ట్రిక్ ఇంజినీర్: 04
ఆఫీసర్ ఆర్కిటెక్ట్: 01
ఆఫీసర్ ఎకనామిక్స్: 06
మేనేజర్ ఎకనామిక్స్: 04
మేనేజర్-డేటా సైంటిస్ట్: 03
సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్: 02
మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 04
సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 03

విద్యార్హత:
పోస్టును అనుసరించి గ్రాడ్యూయేషన్/బీఈ/బీటెక్/బీఆర్క్/సీఏ/సీఎంఏ/ఐడీడబ్ల్యూఏ/ఎంఈ/ఎంటెక్/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/పీజీడీఎంలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు 21 నుంచి 38 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపు ఉంది.

ఫీజు:
దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 50+జీఎస్టీ, ఇతరులకు రూ. 1000+జీఎస్టీ

ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష/ఆన్‌లైన్ టెస్ట్(అవసరమైతే), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం:
ఉద్యోగస్థాయిని బట్టి నెలకు కనిష్టంగా రూ. 36 వేలు, గరిష్టంగా రూ. 78వేల వరకు వేతనం చెల్లిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://ibpsonline.ibps.in/pnbmay23/

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+