Year Ender 2023: గతేడాదిలో ఉద్యోగులకు టాప్ జీతాలు చెల్లించిన రంగాలు, జాబ్స్ ఇవే..!
ఈ ఏడాది భారత్ లో పలు కీలక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అత్యధిక వేతనాల్ని అందుకున్నారు. వీటిలో కొన్ని సంప్రదాయ రంగాలతో పాటు పలు వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు కూడా ఉన్నాయి. ఈ రంగాల్లో ఉన్న సంస్ధలు ఉద్యోగులకు అత్యధిక వేతనాలను చెల్లించి వారి సేవల్ని పొందాయి. అంతే కాదు కొత్త ఏడాదిలో తమ రంగాల్లోకి రావాలనుకుంటున్న ఫ్రెషర్స్ లోనూ ఆశలు రేకెత్తించాయి. ఇలాంటి కొన్ని రంగాల్ని ఓసారి పరిశీలిద్దాం..
గతేడాది కాలంలో తమ ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు చెల్లించిన రంగాల్లో సంప్రదాయ బ్యాకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, తయారీ వంటి రంగాలతో పాటు అభివృద్ధి చెందుతున్న కృత్రిమమేథ, గ్రీన్ ఎకానమీ, సస్టెయినబిలిటీ, ఫిన్ టెక్, ఈ కామర్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, డ్రోన్స్ వంటివి కూడా ఉన్నాయి. వీటిలో పనిచేసిన ఉద్యోగులు భారత్ లో అత్యధిక వేతనాలు అందుకున్నారు.

వీటిలో రంగాల వారీగా చూసుకుంటే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌ల రూపకల్పన, పరీక్ష, నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ లు సగటున వార్షిక వేతనంగా రూ.29 లక్షలు అందుకున్నారు. అలాగే విస్తృతమైన డేటాసెట్‌లను విశ్లేషించడం ద్వారా అమూల్యమైన ఇన్ సైట్స్ అందించే డేటా సైంటిస్టులు ఏడాదికి రూ.14 లక్షల నుండి రూ.25 లక్షల వరకు అర్జించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో నైపుణ్యం కలిగిన వారి సగటు జీతాలు సంవత్సరానికి రూ. 11 లక్షల నుండి రూ. 21 లక్షల వరకు లభించాయి.
మరోవైపు డిజిటల్ ఛానెల్‌లలో ఆన్‌లైన్ ప్రమోషన్‌లో నైపుణ్యం సాధిస్తూ, డిజిటల్ మార్కెటర్లు సంవత్సరానికి రూ.4 నుండి రూ.15 లక్షల మధ్య సంపాదిస్తున్నారు. డేటా, సిస్టమ్‌ల సంరక్షకులైన సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్‌లు సంవత్సరానికి సగటున రూ. 6 లక్షల నుండి రూ. 20 లక్షల జీతం పొందుతున్నారు. సరైన అవుట్‌పుట్ కోసం లాంగ్వేజ్ మోడల్ ఇన్‌పుట్‌లను రూపొందించే ప్రాంప్ట్ ఇంజనీర్లు సంవత్సరానికి రూ.5 నుండి 10 లక్షల మధ్య సంపాదిస్తున్నారు.
అలాగే పైలట్లు ఏటా 9 లక్షల నుంచి 70 లక్షల వరకూ సంపాదించే వారు ఉన్నారు. పర్యావరణ పరిరక్షకులైన గ్రీన్ స్పెషలిస్ట్ లు ఏటా.4 లక్షల నుండి రూ.40 లక్షల వరకు సంపాదించారు. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు సగటున రూ. 5 లక్షల నుండి రూ. 18 లక్షల వరకు జీతం పొందారు. సోలార్ ఇన్‌స్టాలర్స్ ఏటా రూ.2 లక్షల నుండి రూ.8 లక్షల వరకు సంపాదించారు.
బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజర్, రిలేషన్ షిప్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ లు సంవత్సరానికి రూ. 4 లక్షల నుండి రూ.34లక్షల వరకు జీతాలు తీసుకున్నారు. స్టోర్ మేనేజర్, మర్చండైజర్, కొనుగోలుదారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇ-కామర్స్ మేనేజర్ సంవత్సరానికి సగటున రూ. 2 లక్షల నుండి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ప్రొడక్షన్ మేనేజర్, క్వాలిటీ ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్ ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వేతనాలు తీసుకున్నారు.
లాజిస్టిక్స్ మేనేజర్, సప్లై చైన్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, వేర్‌హౌస్ మేనేజర్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ ఏడాది రూ.2 లక్షల నుండి 18 లక్షల వరకు జీతం తీసుకుంటున్నారు. మార్కెటింగ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, బ్రాండ్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్ జీతాలు సంవత్సరానికి రూ. 4 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఉన్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications