పెళ్లి పేరుతో నాగార్జునను మోసం చేసిన మహిళా నిర్మాత?

ప్రస్తుత రోజుల్లో ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు అనేవి చాలా సహజంగా మారిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ మహిళా నిర్మాత ఓ కెమెరామెన్ ను మోసం చేసింది. దీంతో సదరు కెమెరామెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంలోని వెంకటగిరిలో నివసించే పుల్లంశెట్టి నాగార్జునబాబు తెలుగు సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.

ఒక సినిమాకు పనిచేసే సమయంలో నిర్మాత మల్లికతో పరిచయం అయింది. తనకు వివాహమైందని, భర్తకు విడాకులిచ్చేస్తున్నట్లు నాగార్జునకు తెలిపింది. తర్వాత వారిద్దరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ కెమెరామెన్ చిలుకూలరు బాలాజీ దేవాలయంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తనకు డబ్బు అవసరమైందంటూ నాగార్జున దగ్గర మల్లిక రూ.18.50 లక్షలు తీసుకుంది. తర్వాత ఆ డబ్బుల గురించి అడుగుతుండటంతో బెదిరింపులకు దిగింది.

a female producer cheated cameramen Nagarjuna

దీనిపై నాగార్జునబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆరా తీశారు. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన నాగార్జున కూడా విచారణకు దిగాడు. అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తేలింది. తనకు ఒక వివాహమే అయిందని, పిల్లలు కూడా లేరని అబద్దం చెప్పి పెళ్లిచేసుకుందంటూ నాగార్జునబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2016లో గాజువాక పోలీస్ స్టేషన్లో, 2019లో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఇలాగే ఫిర్యాదులు అందినట్లు తేలింది. నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ తిరుగుతుందని పోలీసులు తేల్చారు. నాగార్జున దగ్గర నుంచి తీసుకున్న రూ.18.50 లక్షలను ఏం చేసింది? ఏ సందర్భంలో వాటిని ఉపయోగించింది? అందుకు వాడిన బ్యాంకు ఖాతాల కోసం పోలీసులు మరింత లోతుగా పరిశోధన చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+