హీరో దర్శన్ మర్దర్ కేసులో ట్విస్ట్, హీరో, గర్ల్ ఫ్రెండ్ ను అరెస్టు చేసిన పోలీసు అధికారిపై వేటు
కన్నడ సినీనటుడు, ఛాలెంజింగ్ స్టార్, డీ బాస్ దర్శన్ ప్రమేయంతోనే ఓ హత్య జరిగిందని కేసు నమోదు కావడంతో ఆ హీరో అరెస్టు అయ్యాడు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసు కీలక దశకు చేరుకునే తరుణంలో ఆకేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారిని హఠాత్తుగా బదిలి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. హీరో దర్శన్ ను అరెస్టు చేసిన పోలీసు అధికారి మీద బదిలి వేటు పడింది.
రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించి ఆయన్ను వేరే పోలీస్ స్టేషన్ కు బదిలి చేశారు. ఇప్పుడు హీరో దర్శన్ హత్య కేసు విచారణాధికారిగా బెంగళూరు సిటీలోని విజయనగర్ సబ్ డివిజన్ ఏసీపీ చందన్‌ను నియమించారు. వెంటనే దర్శన్ కేసు దర్యాప్తు ఫైల్ తీసుకుని విచారణ చెయ్యాలని ఏసీపీ చందన్ కు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గిరీష్ నాయక్ హీరో దర్శన్ హత్య కేసునువిచారిస్తున్నారు. అయితే హీరో దర్శన్ కేసును నేటి నుంచి ఏసీపీ చందన్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గిరీష్ నాయక్ ను బెంగళూరులోని సీకే అచ్చుకట్ట స్టేషన్ నుంచి బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఇదే కామాక్షిపాళ్య పోలీస్ ఇన్స్ పెక్టర్ గిరీష్ నాయక్ టీమ్ మైసూరులో హీరో దర్శన్ ను అరెస్టు చేసింది.
అయితే నువ్వు నీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించడానికి వెళ్లాలని గిరీష్ నాయక్ కు బదిలి ఆదేశాలు అందాయి. రేణుకాస్వామి హత్య కేసు బాధ్యత వేరే వారి భుజాలపై పడింది. రేణుకాస్వామి కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న గిరీష్ నాయక్ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ్ తో సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి కేసును సమర్ధవంతంగా నడిపించారు. దర్శన్ అరెస్టుతో ఇన్స్ పెక్టర్ గిరీష్ నాయక్ పేరు కర్ణాటక మొత్తం వినిపించింది.
ఇప్పుడు గిరీష్ నాయక్ తిరిగి సీకే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌కు బదిలి చెయ్యడంతో ఆ కేసు విచారణకు కొత్త విచారణ అధికారిగా విజయనగర్ సబ్ డివిజన్ ఏసీపీ చందన్ నియమితులయ్యారు. ఏసీపీ చందన్ నేతృత్వంలో హీరో దర్శన్ కేసు తదుపరి విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంది. అయితే హీరో దర్శన్ కేసు విషయంలో కొందరు ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నారని, అందుకే వాళ్లకు కాలసిన పోలీసు అధికారికి రేణుకాస్వామి హత్య కేసు అప్పగించి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications