విడాకులు ఖాయమైన అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్?
అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ జంట విడాకులు తీసుకోబోతోందంటూ కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై అధికారికంగా వారినుంచి ధ్రువీకరణ మాత్రం రాలేదు. తాజాగా ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక సందర్భంగా జరిగిన ఓ సంఘటన ఈ పుకార్లను నిజం చేసింది. ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ - రాధిక మార్చంట్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆహ్వానం అందుకున్న బిగ్ బి అమితాబ్ కుటుంబం కూడా ఈ వేడుకకు హాజరైంది.
విడిగా వచ్చిన ఐశ్వర్య, ఆరాధ్య
ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలంతా కలిసి వచ్చారు. అయితే ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్య మాత్రం విడిగా వచ్చారు. దీంతో ఎప్పటినుంచో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారంటూ వస్తున్న వార్తలు నిజమేనని చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి విడిగా ఉంటున్నారు. ఇటీవలే తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించి విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నారు.

గతంలో స్పందించిన అభిషేక్
విడాకులకు సంబంధించి గతంలో అభిషేక్ ఒకసారి స్పందించి స్పష్టత ఇచ్చాడు. ఐశ్వర్య మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. వీరిద్దరి పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు గడుస్తోంది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఆ పాప ఫొటోలు కూడా ఇటీవల బాగా పాపులర్ అయ్యాయి. ఐశ్వర్య ఆరాధ్యను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముంయిలో వైభవంగా జరుగుతున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు కుటుంబం, రామ్ చరణ్ కుటుంబం, విక్టరీ వెంకటేష్, రానా వెళ్లారు. అంబానీ ఇంట్లో ఏ వేడుక జరిగినా సినీ సెలబ్రిటీలంతా తప్పనిసరిగా హాజరవుతారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తోపాటు బాలీవుడ్ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.












Click it and Unblock the Notifications