షూటింగ్‌లో ప్రమాదం : తృటిలో తప్పించుకున్న ప్రముఖ గాయని..
ప్రముఖ గాయని, బాలీవుడ్ నటి తులసి కుమార్ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి,
ప్రముఖ గాయని తులసి కుమార్ తన కొత్త మ్యూజిక్ ఆల్బమ్ వీడియో కోసం సెట్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో షూటింగ్‌లో సెట్‌లోని ఆమె వెనుక ఉన్న బ్యాక్‌డ్రాప్‌లోని ఒక సెట్ ప్రాపర్టీ పడిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ సెట్ పడిపోయేటప్పడు ఆ నటి వెంటనే పక్కకు తప్పుకుంది. ఈ ప్రమాదంలో తులసికి బాగా గాయపడినట్లు ఈ వీడియోలో మనకు కనిపిస్తోంది.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో తులసి కెమెరా ముందు నిల్చొని షూటింగ్‌కి రెడీ అవుతున్న క్రమంలో ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె వెనకాల ఉన్నసెట్ ఆమెపై పడింది. అదే సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకోవడంతో భయంతో ఆ నటి పరుగులు తీసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

గాయని వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఉండకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఈ వీడియోను చూస్తుంటే అర్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట తెగ హాల్చల్ చేస్తోంది. ఈ వీడియోను బట్టి చూస్తే నటి గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఆమె గాయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. వీడియో చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. తులసి కుమార్ రేడియో జాకీగా కూడా పనిచేశారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు. అలాగే పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు.
Unexpected mishap! Tulsi Kumar injured on the set of her new music video—caught live on camera! 😱 pic.twitter.com/u26h3JqfXA
— Bollywood World (@bwoodworld) October 8, 2024












Click it and Unblock the Notifications