ప్రభాస్ ఖాతాలో బ్లాస్టింగ్ రికార్డ్
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో అరుదైన, రేర్ రికార్డు పడింది. సలార్ చిత్రంతో దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అధిగమించింది. డార్లింగ్ ను అభిమానించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే మార్కెట్ కూడా విశ్వవ్యాప్తం అవుతోంది. రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల మధ్యలో ప్రభాస్ పారితోషికం ఉంటోంది.
చాలా ఏరియాల్లో సలార్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది. 700 కోట్ల రూపాయల కలెక్షన్లు దాటిన రెండు సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ మాత్రమే ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. ప్రభాస్ అన్న రేంజ్ అంటేనే అది ఒక లెవల్ లో ఉంటుందని, మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాక్సాఫీస్ వద్ద బ్లాస్టింగ్ రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒకటైన ప్రాజెక్ట్ కే ఈ ఏడాది మే 9న విడుదల కాబోతోంది. ఆ తేదీకి, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ కు అవినాభావ సంబంధం ఉంది. దాదాపుగా అదే తేదీకి ఈ సినిమా విడుదల కాబోతందంటున్నారు. ప్రాజెక్ట్ కేలో అమితాబ్ బచ్చన్, కమల్ హాస్, దీపికా పదుకొనే లాంటి భారీ తారగణం నటిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. దీన్ని పాన్ ఇండియా సినిమాగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ లో కూడా జెండా పాతడం ఖాయమనే నమ్మకాన్ని డార్లింగ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన విజువల్స్ ను, రిచ్ నెస్ ను ఈ సినిమాతో భారతీయ తెరకు కూడా పరిచయం చేయనున్నామని వారంతా గర్వంగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications