Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇన్నాళ్లకు ఓపెన్ అయిన కట్టప్ప.. రజినీతో అందుకే నటించనని చెప్పా !

సత్యరాజ్.. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. అంతగా తన పాత్రతో ఫేమస్ అయ్యారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

హీరోగా కెరీర్ స్టార్ట్..

హీరోగా సినీ ప్రయాణం ప్రారంభించిన సత్యరాజ్.. ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యపాత్రలలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

actor-satyaraj-opens-on-issue-with-super-star-rajinikanth

రీసెంట్ గానే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలో నటించారు. ఈ సినిమాలో రజినీ - సత్యరాజ్ ఫ్రెండ్స్ గా కనిపించారు. అలానే ఈ చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. శృతి హాసన్, పూజా హెగ్డే ముఖ్యపాత్రలు పోషించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. అయితే రజినీకాంత్ సినిమాలో తాను నటించనని 18 ఏళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.

ఇష్యూ అదే..

కెరీర్ మొదట్లో సత్యరాజ్, రజినీకాంత్ కలిసి " మిస్టర్ భరత్ " అనే సినిమాలో నటించారు. 1986లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వయస్సు తక్కువ అయినా కూడా సత్యరాజ్.. రజినీకి తండ్రిగా నటించాడు. ఈ సినిమా తరువాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారాడు. అయితే ఆ తర్వాత వీరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటుంటారు. అందుకే శివాజీ సినిమాలో సుమన్ పాత్ర మొదట సత్యరాజ్ వద్దకు వెళ్లగా.. ఆయన నిరాకరించారని చెబుతారు.

శంకరే స్వయంగా అడిగినా కూడా సత్యరాజ్.. తాము ఎంత కష్టపడి నటించినా రజినీ తన స్టైల్ తో సినిమా మొత్తాన్ని తనవైపునకు తిప్పేసుకుంటాడు. అందుకే రజినీ సినిమాలు ఇకనుంచి చేయను అని సత్యరాజ్ తెగేసి చెప్పాడట. దీంతో అప్పట్లో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. సూపర్ స్టార్ కూడా సత్యరాజ్ తో విభేదాల గురించి స్టేజీపైనే ఓపెన్ అయ్యారు. అయితే అప్పటి వివాదానికి సత్యరాజ్ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు.

అందుకే నటించనని చెప్పా..!

అప్పట్లో తాను అన్నానని బయటికి వచ్చిన వ్యాఖ్యలన్ని అవాస్తవమని సత్యరాజ్ కొట్టిపారేశారు. తాను ఏరోజు అలా మాట్లాడలేదని.. శివాజీ సినిమాను రిజెక్ట్ చేయడానికి వేరే కారణం ఉందన్నారు. శివాజీ సినిమా చేసే సమయంలోనే నేను హీరోగా నిలదొక్కుకుంటున్నానని.. అప్పుడు ఆ పాత్రను ఒప్పుకుంటే.. ఆ తరువాత కూడా అలాంటి పాత్రలే వస్తాయని భయపడ్డానన్నారు. అందుకే ఆ పాత్రను వదులుకున్నానని.. కానీ ఏవేవో రాసారని ఓపెన్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+