దెబ్బ అదుర్స్ కదూ.. కరాటే కళ్యాణి,తమన్నా సింహాద్రికి షాక్ ఇచ్చిన హేమ
డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన హేమా కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. మీడియాలో సైతం ఆమెపై గట్టి గానే ఫోకస్ చేయడంతో ఆమె ఈమధ్య మీడియాకి కాస్త దూరంగానే ఉంటున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కేసు నుంచి మా ఇంకా బయటపడలేదని తెలుస్తుంది.
ఇప్పుడు తాజాగా తనపై అసత్య ప్రచారం చేసినందుకు గాను పలు యూట్యూబ్ ఛానల్స్ పై.. అలాగే కొందరు టాలీవుడ్ ప్రముఖులకు సైతం లీగల్ నోటీసులు పంపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రిలకు నోటీసులు పంపించింది హేమ. తన పరువు, ప్రతిష్టను భంగం కలిగించారని ఆమె ఆరోపించారు. రెండు యూట్యూబ్ ఛానెల్స్ పైనా చట్టపరమైన చర్యలకు సిద్దమైంది హేమ.

లాస్ట్ టైమ్ ఓ ఇష్యూలో కూడా తనపై బుదర చల్లే ప్రయత్నం చేశారని.. పరువుకు నష్టం కలిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు వెల్లడించారు. సినిమా వాళ్లను చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారని.. నాలా మరొకరికి ఇలా జరగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఆ వీడియోలన్నీ నెట్‌లో కొడితే వస్తున్నాయని.. తాను తప్పు చేయకుండా బ్లేమ్ అయ్యా అని వెల్లడించారు.
హేమ.. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500 పైగా చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటే సీరియల్స్‌లో కూడా నటించింది. చివరిగా 2023లో వచ్చిన ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాలో కనిపించింది. ఈ మధ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఈమె, ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.












Click it and Unblock the Notifications