గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న మెగా హీరోయిన్...?
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంటూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఇక చిరంజీవి, బాలకృష్ణ , పవన్ కల్యాణ్ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. ముఖ్యంగా మెగా హీరోలైన రామ్ చరణ్, చిరంజీవి, , పవన్ కల్యాణ్‌లతో నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన కాజల్ గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినేస్ మ్యాన్‌తో ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు రిలేషన్‌షిప్‌లో కొనసాగించిన కాజల్ అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కాజల్ హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. ఇదే సమయంలో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచియం రావడంతో కాజల్‌కు అవకాశాలు తగ్గాయి.

ఇక కాజల్ గర్భవతి కావడం బాబుకు జన్మనివ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీలో నటించింది. కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..కాజల్ అగర్వాల్ రెండోసారి తల్లి కాబోతుందని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ రెండోసారి గర్భవతి అయిందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీని కారణంగానే కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. అయితే ప్రెగ్నెన్సీపై కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. దీంతో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications