నరేష్‌ను వదిలేసిన పవిత్రా లోకేష్?
హీరో నుంచి క్యారెక్టర్ నటుడిగా మారిన నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. క్యారెక్టర్ నటుడైన తర్వాత పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తూ ఆ పాత్రను రక్తి కట్టిస్తూ దర్శకులకు ఎక్కువగా ఇష్టపడే నటుడిగా మారారు. నరేష్ అనగానే మనకు మరో పేరు కూడా గుర్తుకు వస్తుంది. ఆ పేరు ఎవరిదంటే .. పవిత్రా లోకేష్. వీరి ప్రేమ వ్యవహారం దక్షిణ భారతదేశంలో అత్యంత పాపులరైంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేసిన గొడవ కూడా అంతకుమించి పాపులర్ అయింది.
ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు
రమ్య రఘుపతి నుంచి విడాకులు రాకపోవడంతో ప్రస్తుతం ఈ జంట సహజీవనం చేస్తోంది. తానాగా నరేష్ విలపిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. నాగేశ్వర్ గారూ.. తమ బేబీ, బుజ్జి ఎటో వెళ్లిపోయిందని, అది లేకుండా తాను అన్నం కూడా తినలేనని, అకస్మాత్తుగా తనను వదిలి వెళ్లిపోయిందని, అన్నిచోట్లా తిరిగి, అందరినీ కనుక్కున్నానని, కానీ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారంటూ కళ్లమ్మట నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ వీడియో చూసినవారంతా పవిత్రా లోకేష్ నరేష్ ను వదిలేసి వెళ్లిపోయిందని భావించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు.

వీరాంజనేయులు సినిమా ప్రమోషన్ లో భాగంగా
అయితే అదంతా నిజమైంది కాదని, నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న వీరాంజనేయులు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ వీడియో చేసి విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా నేరుగా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్నవారంతా షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే పవిత్రా లోకేష్ వెళ్లిపోవడంవల్ల నరేష్ కు మంచే జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ ప్రేమజంట మధ్య ఎడబాటు రాదని, వీరిద్దరూ వివాహం చేసుకుంటారా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుందంటూ కామెంట్లు పెట్టారు. చివరకు బుజ్జి పేరుతో చేసిన ప్రచారం కూడా ఈ జంటకు కలిసివచ్చిందని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications