అడ్డంగా బుక్కైన తమన్నా..?

మిల్కీ బ్యూటీ తమన్నా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మనీలాండరింగ్ కేసులో ఆమెను అధికారులు విచారిస్తోన్నట్టు తెలుస్తోంది. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హీరోయిన్ తమన్నాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నించింది. 'HPZ టోకెన్' మొబైల్ యాప్‌ నిర్వాహకులు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. బిట్‌కాయిన్‌లు, ఇతర క్రిప్టోకరెన్సీల సాకుతో పలువురు పెట్టుబడిదారులను ఆకర్షించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఈ యాప్ ద్వారా మోసపోయామని భావించిన బాధితులు 'HPZ టోకెన్' యాప్ నిర్వాహకుల మీద కేసు చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ యాప్‌కు తమన్నాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆమెను ఈడీ అధికారులు విచారణకు హాజరవ్వాలని కోరారు. 'HPZ టోకెన్' యాప్ ఆర్గనైజ్ చేసిన ఓ ఈవెంట్‌కు తమన్నా భాటియా హాజరయ్యారు. సెలబ్రిటీ హోదాలో తమన్నా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే దీని కోసం ఆమె నిర్వహకుల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే తమన్నాను ఈడీ అధికారులు సీక్రెట్‌గా విచారించినట్లు తెలుస్తోంది.

Actress Tamannaah Bhatia questioned by ED

అయితే తమన్నాపై ఎటువంటి అభియోగాలు మోపలేదని, కేవలం 'HPZ టోకెన్' యాప్ నిర్వహకుల నుంచి ఎమైనా రెమ్యునరేషన్ తీసుకున్నారా లేదా అన్న క్లారిటీ కోసమే ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈ యాప్ ఇతర విదేశీ పౌరులచే నియంత్రించబడుతున్నాయి. మార్చిలో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో యాప్ నిర్వాహకులను నిందితులుగా చేర్చింది. ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది తమన్నా వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+