ఆఫర్ కావాలంటే అతనితో పడుకోవాలన్నారు..నటి సంచలన కామెంట్స్
సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు.
పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

తాజాగా మరో నటి తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు గురించి వెల్లడించడం జరిగింది. మరాఠీ నటి తమ్‌హంకర్ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారని ఓ వ్యక్తి నుంచి నాకు కాల్ వచ్చింది. కానీ సినిమాలో ఆఫర్ కావాలంటే నిర్మాతతో పాటు, దర్శకుడుతో కూడా ఒకరాత్రి గడపాల్సి ఉంటుందని చెప్పాడు.
దీంతో నాకు పిచ్చ కోపం వచ్చి..నా స్థానంలో మీ అమ్మను ఎందుకు పంపవచ్చు కదా అనేశాను.కానీ అతను సైలెంట్‌గా ఉన్నాడు. నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు. అప్పటి నుంచి అలాంటి ఘటనలు తనకు ఎప్పుడు కూడా ఎదురు కాలేదని ఈ భామ చెప్పుకొచ్చింది. దీంతో నాకు ఓ విషయం బాగా అర్థమైంది. మనకి నచ్చని విషయం ఎవరైనా చెబితే ధైర్యంగా సమాధానం చెప్పాలి. లేదంటే ఇండస్ట్రీలో కొనసాగలేం అని తమ్‌హంకర్ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications