Aadarsha Kutumbam First Review: 'ఆదర్శ కుటుంబం' ఫస్ట్ రివ్యూ.. వెంకీ- త్రివిక్రమ్ మ్యాజిక్..!!
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో ఓ కీలక పాత్ర చేసి అలరించారు. అయితే ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 'ఆదర్శ కుటుంబం- AK47' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 9, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.
మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అలాగే త్రివిక్రమ్- వెంకటేశ్ కాంబోలో గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దాంతో చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తున్న క్రమంలో ఆడియన్స్ లో భారీ ఆశలు నెలకున్నాయి. ఇక మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుసగా ప్రొమోషన్స్ ను స్టార్ట్ చేసింది. వెంకటేశ్, త్రివిక్రమ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అయితే తాజాగా ఆదర్శ కుటుంబం ప్రివ్యూను ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టాక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫస్టాఫ్ మొత్తం వింటేజ్ త్రివిక్రమ్ మార్క్ కామెడీతో సాగుతుందని.. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండాయని టాక్. ముఖ్యంగా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయినట్లు సమాచారం. ఇక సెకండాఫ్ లో కామెడీతోపాటు యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయాయని తెలుస్తోంది. క్లైమాక్స్ కూడా బాగా వచ్చినట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇరుముడి మూవీ తర్వాత టాలీవుడ్ లో మరో సెన్సేషన్ క్రియేట్ అవ్వబోతుందని టాక్ ఈ చిత్రానికి వస్తుంది. ఇక పూర్తి రివ్యూ కోసం సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications
