మహేష్ బాబు తర్వాత ఆ హీరోతో రాజమౌళి సినిమా?
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలు పూర్తిచేయడంతోపాటు ఇతర పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బడ్జెట్ రూ.1000 నుంచి రూ.1500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ సినిమాను రాజమౌళి తీర్చిద్దబోతున్నారు.
మహేష్ బాబుతో సినిమా పూర్తయిన తర్వాత ఏ హీరోతో సినిమా తీస్తాడు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వాస్తవానికి ఈ సినిమాకే దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇది రెండు భాగాలుగా వస్తుందా? లేదంటే ఒక భాగంతో సరిపెడతారా? అనే స్పష్టత రాలేదు. రాజమౌళి అంటేనే పాన్ వరల్డ్, పాన్ ఇండియా భారీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అటువంటి దర్శకుడితో తర్వాత ఎవరా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తెలుగు, తమిళ స్టార్ హీరో సూర్యతో రాజమౌళి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మగధీర సినిమా పూర్తయిన వెంటనే సూర్యతో రాజమౌళి ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎందుకో అది పట్టాలెక్కలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కథ వర్కౌట్ కావడంలేదంటున్నారు. మహేష్ బాబుతో సినిమా పూర్తయిన వెంటనే కచ్చితంగా సూర్యతోనే సినిమా చేస్తారని సమాచారం. రాజమౌళితో సినిమా చేయడానికి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానని సూర్య కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్నిబట్టి వీరిద్దరి ప్రాజెక్ట్ ఓకే అయిందని, మహేష్ బాబు సినిమా పూర్తవగానే దీనిపై రాజమౌళి దృష్టిపెడతాడంటున్నారు.












Click it and Unblock the Notifications