జానీమాస్టర్‌కో న్యాయం.. కేశవ్‌కో న్యాయమా.. అల్లు అర్జున్?

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు. క్లైమాక్స్ షూటింగ్ తోపాటు ప్రత్యేక గీతం షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15నే విడుదల కావాల్సివున్న ఈ సినిమా పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదం ఏర్పడటంతో డిసెంబరు 6కు వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా జానీమాస్టర్ వివాదం తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తనపై లైంగిక వేధింపులతోపాటు బలాత్కారం చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయగా జానీమాస్టర్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.

బయటకు తెలియని కారణాలేంటి
బాధితురాలికి అల్లు అర్జున్ అండగా నిలబడ్డారు. తన మేనేజర్ ను ఆమె దగ్గరకు పంపించి అభయం ఇచ్చారు. భవిష్యత్తులో తమ సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తాననే హామీని ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పటికీ స్పందించని అల్లు అర్జున్ జానీమాస్టర్ విషయంలో స్పందించడానికి కారణం అతను జనసేనకు, పవన్ కల్యాణ్ కు లాయల్టీగా ఉండటం ఓ కారణమని తెలుస్తోంది. బయటకు తెలియని కారణాలు వేరే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తీసే ప్రతి సినిమా కొరియోగ్రఫీ బాధ్యతలు చూసే అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

Allu Arjun justice one way in the case of Johnny Master and another in the case of Keshav

ఇందులో కూడా రాజకీయం అవసరమా?
అంతవరకు బాగానేవుందికానీ పుష్ప2లో తనతోపాటు నటిస్తున్న కేశవ విషయంలో ఎందుకు స్పందించడంలేదనే ప్రశ్న నెటిజన్ల నుంచి ఉత్పన్నమవుతోంది. అల్లు అర్జున్ పక్కనే సినిమా అంతా ఉంటున్న కేశవ ఇటీవలే ఒక యువతిని లైంగికంగా వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో కొద్దిరోజులు పుష్ప2 షూటింగ్ ఆగిపోయింది. దీంతో నిర్మాతలు భారీగా డబ్బు ఖర్చుపెట్టి అతన్ని బెయిల్ పై బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆ మరణించిన యువతి తరఫున అల్లు అర్జున్ స్పందించి ఆ కుటుంబానికి కొంత పరిహారం అందజేసివుంటే బాగుండేదని, అలా ఎందుకు చేయలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందులో కూడా రాజకీయాలు అవసరమా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+