ఓటీటీలోకి తెలుగు న్యూ ఏజ్ లవ్ స్టోరీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ- టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ 'ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్' మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య కాంబోలో గతంలో బేబీ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

దాంతో ఎపిక్ మూవీపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ అనూహ్యంగా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. అక్టోబర్ 9 న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ గతంలోనే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తమిళం, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

ఇక థియేటర్లలో ఎపిక్ మూవీని మిస్ చేసుకున్న వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా మూవీని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీని 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ప్రశంసలు అందుకున్న ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. ఆదిత్య తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల నుంచి ఈ కథను సిద్ధం చేసుకున్నారు. ఇక సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సినిమా రూపొందింది.

AnandDeverakonda and Vaishnavi Chaitanya s epic movie set for OTT streaming Netflix from October 9

స్టోరీ విషయానికి వస్తే.. 90' స్ సిరీస్‌ లో పిల్లాడుగా ఉన్న ఆదిత్య (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) పెద్దయిన తర్వాత మూవీ డైరెక్టర్ కావాల‌ని క‌ల‌ కంటాడు. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే పైచ‌దువుల కోస‌మ‌ని లండ‌న్ వెళ్తాడు. అయితే తాను చేరిన యూనివర్సిటీలోని తెలుగ‌మ్మాయి అయిన క‌డ‌లి (వైష్ణ‌వి చైత‌న్య)తో పరిచయం ఏర్పడుతుంది. తొలిరోజే ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌వుతారు. త‌ర్వాత స‌హ‌జీవ‌నం చేస్తారు. రెండు వేర్వేరు కుటుంబ నేప‌థ్యాలకు చెందిన వీళ్లిద్ద‌రి మ‌ధ్య బంధం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లింది..? ఆదిత్య.. ప్రేమ, పెళ్లి విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నాడు..? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ లైన్..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+