అందం కోసం అనసూయ ఫీట్లు

తలకిందులుగా ఏరియల్ యోగ చేస్తున్న అనసూయ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందం కోసం ఎంత కష్టం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీలో త్వరలోనే సందడి చేయనుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో దాక్షాయణిగా నెగిటివ్ రోల్ చేస్తోంది.

అనసూయ భరద్వాజ్ తెలుగు చిత్ర సీమలో బిజీ యాక్ట్రెస్ గా ఉంది. ఏడాదికి అరడజను సినిమాలనుంచి ఎనిమిది సినిమాల వరకు చేస్తోంది. 2023లో మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాలు విడుదలయ్యాయి. విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోన్న అనసూయ ఎంతో ఫిట్ గా ఉంటారు. స్లిమ్ గా, గ్లామర్ గా ఉన్నప్పుడు అవకాశాలు తలుపు తడతాయనే విషయం ఆమెకు తెలియంది కాదు.

anasuya abharadwaj ariel yoga exercise images

వివాహమై పిల్లలున్న అనసూయ వయసు తగ్గించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటుంది. ఈ మధ్య కొంచెం బొద్దుగా తయారయ్యారు. 38 ఏళ్ల అనసూయను ఆంటీ అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. బరువు పెరగకుండా ఉండేందుకు అనసూయ రోజూ వ్యాయామం చేస్తుంది. దాంతోపాటు డైట్ ఫాలో అవుతుంది. కొత్తగా ఏరియల్ యోగ స్టార్ట్ చేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తలక్రిందులుగా ఏరియల్ యోగ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందం కోసం ఎంత కష్టం వచ్చి పడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొంటోంది. యాంకరింగ్ మానేసిన తర్వాత నటనపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+