తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో ప్రేమలో యాంకర్ ప్రదీప్... త్వరలోనే పెళ్లి?
యాంకర్ ప్రదీప్ గురించి ఏపీ, తెలంగాణలో తెలియనివారుండరు. దాదాపుగా అన్ని ప్రముఖ ఛానళ్లలో కార్యక్రమాలు చేశాడు. ప్రదీప్ చేసే కార్యక్రమాలకు మంచి రేటింగ్స్ వచ్చేవి. ఇతర యాంకర్లలా డబుల్ మీనింగ్స్ ఉపయోగించకుండా సాంప్రదాయబద్దంగా ఉండటంతో అందరూ అతని కార్యక్రమాలను, యాంకరింగ్ ను చూస్తారు. ఢీ షో నుంచి తప్పుకోవడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు. సినిమాలు కూడా చేస్తున్నాడుకానీ అనుకున్నస్థాయిలో అవి పేరు తీసుకురావడంలేదు. మధ్యమధ్యలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తున్నాడు.
కూటమి ఎమ్మెల్యేతో ప్రేమలో
మూడు పదుల వయసు దాటినప్పటికీ అందరూ పెళ్లి అని అడుగుతుంటే సమాధానం మాత్రం చెప్పడంలేదు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ ఎమ్మెల్యేతో రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. ఆమెకు కూడా 30 సంవత్సరాల వయసు ఉంటుందని, ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎంతో బిజీగా ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పోటీచేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించింది.

వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా కుదిరింది?
కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమెకు ప్రదీప్ తో ప్రేమ ఎలా కుదిరింది? ఎలా పరిచయం అయింది? ఎన్ని సంవత్సరాల నుంచి వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది? ఎప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది? ఈ వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అయితే మూడుముళ్ల బంధంతో వీరిద్దరూ ఒకటవుతారని ప్రదీప్ మాచిరాజు అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పేరుతో ఓ సినిమా పూర్తిచేశాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేయగా ఆకట్టుకుంది. జబర్దస్త్ కార్యక్రమంద్వారా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పిల్లి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications