తెలుగు స్టార్ డైరెక్టర్‌తో ప్రేమలో యాంకర్ రష్మి?

బుల్లితెరపై యాంకర్లలో సూపర్ స్టార్ హోదా అనుభవిస్తున్న రష్మీ గౌతమ్ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత సినిమాల్లో కూడా నటించినప్పటికీ బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. సుడిగాలి సుధీర్ తో రష్మి కెమిస్ట్రీ చూసినవారంతా వీరిద్దరూ పెళ్లిచేసుకుంటారని భావించారుకానీ అదంతా కేవలం తెరపై మాత్రమేనని, నిజ జీవితంలో తాము కేవలం స్నేహితులమేనని చెప్పడంతో వారిద్దరి అభిమానులంతా నిరాశ పడ్డారు. తాజాగా రష్మి తెలుగు స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

ఈ విషయం నిజమా? కాదా? అని అడిగింది
రష్మికి ఒక స్టార్ డైరెక్టర్ కొన్నిరోజుల నుంచి తనను తాను పరిచయం చేసుకోకుండా అపరిచిత వ్యక్తిగా పరిచయం చేసుకొని మాట్లాడుతేండేవాడు. అలా ఫోన్ లోనే కొద్దిరోజులు మాట్లాడారు. తర్వాత తనను కలవాలని కోరగా, స్థలం చెబితే అక్కడకు వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత రష్మి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఎందుకంటే అతను తెలుగులోనేకాదు.. భారతదేశంలోనే స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి. అసలు ఆ విషయాన్ని నమ్మలేదు. నిజమా? కాదా? అని అడుగుతుంది. తర్వాత ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకుంటారు. తనను తాను గిల్లి చూసుకున్నప్పటికీ నమ్మలేకపోతున్నానని రష్మి అంటే, లేదు.. కచ్చితంగా నమ్మొచ్చని రాజమౌళి చెబుతారు.

Anchor Rashmi in love with Telugu star director

అరగంటకోసారి మాట్లాడినా చాలు
నాతో రోజూ ఫోన్ మాట్లాడింది మీరా అని రాజమౌళిని అడిగితే రోజులు, గంటలుకాదు.. అరగంటకు ఒకసారైనా మాట్లాడితే చాలు అంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరలవుతోంది. అది చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదెప్పుడు జరిగింది? ఈ సంఘటన తమకు తెలియకుండా ఎప్పడు చోటుచేసుకుంది? అంటూ అడుగుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా, రెండు భాగాలుగా ఈ సినిమాను తీయబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోంది. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+