మందు గ్లాస్‌తో ప్రముఖ యాంకర్ హల్ చల్
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వార్తల్లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. కాస్తా ఫేమస్ వస్తే చాలు దానిని నిలబెట్టుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పనిలో నిమగ్నమైంది ఓ ప్రముఖ యాంకర్. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది మహిళ యాంకర్లు ఉన్నప్పటికీ..అతి తక్కువ కాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది స్రవంతి చొక్కారపు మాత్రమే.
తొలుత యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా చేసిన స్రవంతి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తద్వారా వచ్చిన క్రేజ్‌తో ప్రముఖ టెలివిజన్ షోల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇక బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈ బుల్లితెర బ్యూటీ మరింత ఆదరణ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో స్రవంతిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది.

సోషల్ మీడియాలో స్రవంతి ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. కెరీర్ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. గతంతో పోలిస్తే ఈ మధ్య స్రవంతి అందాల ఆరబోత కాస్తా ఎక్కువైందనే చెప్పాలి. మొదట్లో పద్దతిగా కనిపించిన స్రవంతి..ఇటీవల కాలంలో స్క్రీన్ షోకి తెరలేపింది. గ్లామరెస్‌గా కనిపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా తన ఇంస్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో స్రవంతి ఏకంగా మందు గ్లాసుతో దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. తలపై మందు గ్లాసుతో డాన్స్ చేసిన వీడియోను యాంకర్ స్రవంతి తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు గట్టిగానే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పెళ్లై, పిల్లలున్న నువ్వు ఈ వీడియో ద్వారా సమాజానికి ఏం తెలియజేయాలని అనుకుంటున్నావ్ అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.

పబ్‌లో చేయాల్సినటువంటి డాన్సులు పబ్లిక్‌లో చేస్తున్నారంటూ ఆమెపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్రవంతి ట్రోలింగ్ బారిన పడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె ఇలానే హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు విమర్శలకు గురైయ్యారు. ఎన్ని నెగటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ కూడా ఆమె వ్యవహార శైలి మార్చుకోవడం లేదు.తనపై వస్తున్న ట్రోలింగ్‌ను స్రవంతి లైట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం స్రవంతి మందు గ్లాస్‌తో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications