వైరల్ వీడియో: హీరోయిన్లను మించిన అందం.. అనిల్ రావిపూడి భార్యను చూశారా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్నాడు. గతేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన విక్టరీ వెంకటేశ్ లీడ్ రోల్ లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్. జనవరి 12 న విడుదలైన ఈ మూవీ థియేటర్ల వద్ద విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ఇలా వరుసగా 9 సినిమాలు సూపర్ హిట్స్ కొట్టి టాలీవుడ్ లో ఆ క్రెడిట్ సాధించిన అతి కొద్దిమంది దర్శకుల్లో అనిల్ రావిపూడి నిలిచాడు. ఇక వచ్చే సంక్రాంతికి కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవిలతో సినిమాలు చేసిన అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం మళ్లీ వెంకటేశ్ తో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సీనియర్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జునతోనూ ఓ సినిమా చేయాలంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనిల్ రావిపూడి అమ్మ, నాన్న, భార్య, కూతురు, కుమారులు ఉన్నారు. కూతురు, కుమారుడు వయస్సులో చాలా చిన్నవారు. ఇక భార్య అయితే చక్కగా హోమ్లీ హీరోయిన్ లాగా ఉంది. ఈమె అందం ముందు నేటి తరం యంగ్ హీరోయిన్స్ కూడా పనికిరారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరి ఫ్యామిలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications