'యానిమల్' లో మిషన్ గన్ ఖరీదు ఎంతో తెలుసా?
ఈమధ్య యాక్షన్ సినిమాల్లో హీరోలు పెద్ద పెద్ద మిషన్ గన్‌లతో శత్రువులను సంహరిస్తున్నారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్రమ్, మార్క్ ఆంటోనీ చిత్రాల్లో హీరోలు పెద్ద పెద్ద మిషన్ గన్లు పట్టుకొని విలన్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. వాటికి తగ్గట్లుగానే ఆయా సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్లు బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు యానిమల్ లో కూడా ఇలాంటి సన్నివేశం ఒకటి ఉంది. ట్రైలర్ లో ఆ మిషన్ గన్‌ని దర్శకుడు చూపించాడు.
ఈ మెగా మిషన్ గన్... ఈ సినిమా మొత్తానికి కేంద్ర బిందువుగా మారబోతోందని తెలుస్తోంది. సినిమా ఆర్ట్ డైరెక్టర్ దీనిని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఖరీదు దాదాపు రూ.50 లక్షలు. ప్రస్తుతం ఇది ముంబయిలో ఉంది. దీన్ని హైదరాబాద్ కు తరలించే యోచనలో చిత్ర బృందం ఉంది. కొన్ని థియేటర్లలో ఈ మిషన్ గన్‌ని ప్రదర్శించాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే దీని ట్రావెలింగ్ ఎలా? అనేది యూనిట్ ను వేధిస్తోంది.

యానిమల్ కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు. వాస్తవానికి ఈ సినిమా పూర్తి నిడివి 3 గంటల 49 నిమిషాలుగా వచ్చింది. ఇంత సుదీర్ఘమైన సినిమా చూడడం కష్టం కాబట్టి, దీనిని ట్రిమ్ చేసి విడుదల చేస్తున్నారు. అయితే ఓటీటీలో మాత్రం పూర్తి వెర్షన్ విడుదల చేయనున్నారు. డిసెంబరు 1న యానిమల్ థియేటర్లలోకి వస్తోంది. ఓటీటీ లో ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా, అనిల్ కపూర్ హీరో తండ్రిగా, విలన్ గా బాబీడియోల్ నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే పూర్తిస్థాయిలో అంచనాలున్నాయి. ఆ అంచనాలకు అందుకునే విధంగా సినిమా ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ సినీవర్గాల్లో నెలకొంది. ఒకటోతేదీ ఉదయం 6.00 గంటలకు మొదటి షో వేయనున్నారు.












Click it and Unblock the Notifications