పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్.. "రెండో జన్మ" అంటూ !!
జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆయన భార్య Anna Lezhneva చాలా అరుదుగానే పబ్లిక్‌లో కనిపిస్తుండటంతో, ఆమెకు సంబంధించిన ప్రతి అప్డేట్ హాట్ టాపిక్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో అన్నా ఇటీవల సోషల్ మీడియాలోకి, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
కాగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన కొద్దిరోజులకే అన్నా చేసిన ఎమోషనల్ పోస్టు నెటిజన్లను కదిలిస్తోంది. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గురించి ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏడాది క్రితం జరిగిన భయానక అగ్నిప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ రోజును తన కుమారుడికి "రెండవ పుట్టినరోజు"గా పేర్కొన్నారు. దీంతో అన్నా లెజ్నెవా చేసిన ఈ తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఏడాది క్రితం జరిగిన అగ్నిప్రమాదం వారి కుటుంబానికి మరచిపోలేని సంఘటనగా నిలిచింది. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడి, పొగ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అదే ఘటనలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోవడం, పలువురు పిల్లలు గాయపడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. "ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని నా కొడుకు శ్వాస కోసం పోరాడుతున్న క్షణాలు చూసినప్పుడు నా గుండె చీలిపోయింది" అంటూ అన్నా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
అయితే దేవుడి దయ, వైద్యుల కృషి వల్ల మార్క్ ప్రాణాలతో బయటపడ్డాడని, ఇప్పుడు అతను ఆరోగ్యంగా ఉండటం తమ కుటుంబానికి పెద్ద ఊరట అని ఆమె పేర్కొన్నారు. ఆ రోజును అందుకే తన కుమారుడి "సెకండ్ బర్త్‌డే"గా భావిస్తున్నానని అన్నా తెలిపారు. ఈ ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది రాకముందే ధైర్యంగా ముందుకు వచ్చి పిల్లలను కాపాడిన నిర్మాణ కార్మికులను అన్నా ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి సహసమే అనేక ప్రాణాలను కాపాడిందని, వారు నిజమైన హీరోలని కొనియాడారు. అలాగే బాధిత కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.

అయితే ఈ ఘటనకు కారణమైన వారు ఇప్పటికీ బయటపడకపోవడం ఆమెను కలవరపెడుతోంది. ఏడాది గడిచినా విచారణ పూర్తికాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధితులకు న్యాయం జరగాలని కోరారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా అన్నా ఇచ్చారు. ఇళ్లలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఫైర్ బ్లాంకెట్ వంటి భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారించగలవని ఆమె గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications