కల్కి నుండి మరో క్రేజీ అప్‌డేట్.. త్వరలో ఫస్ట్ సాంగ్ రీలిజ్..
ప్రభాస్ నటించిన కల్కి సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇప్పడు తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే కల్కి సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 27 న విడుదల కానుంది.
రీసెంట్‌గా ఈ మూవీ నుండి బుజ్జి అనే పాత్రను విడుదల చేశారు. ఈ పాత్రకు సంబంధించిన పూర్తి వీడియోను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. దీనికోసం స్పెషల్‌గా ఒక ఈవెంట్‌ను కూడా నిర్వహించనున్నారట. ఈ ఈవెంట్‌లోనే కల్కి సినిమా ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే తోపాటు దిశాపటాని కూడా నటించనున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్దామా క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. ఇక, విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఫుల్ బిజి అయిపోయాడు. ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలు చేశాడు. గతేడాది రీలిజయిన సలార్ ఎంతటి భారీ విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే. సలార్ పార్ట్ 2 కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం అభిమానుల అంచనాలకు మించినట్లుగా ఉంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!












Click it and Unblock the Notifications