కన్నడ ఇండస్ట్రీలో మరో లవ్ ట్రాక్..ఆ హీరో భార్యపై కాంతార నటి పరువు నష్టం కేసు..
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ రోజుకో వివాదంతో వార్తల్లో కెక్కుతుంది. ఇటీవలే స్టార్ హీరో దర్శన్, నటి పవిత్రా గౌడ ఓ హత్య కేసులో ఇప్పటికే జైలుపాలయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది. ఇప్పుడు తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇలాంటిదే మరో లవ్ ట్రాక్ బయటపడింది. ఆ లవ్ ట్రాక్ మరెవరిదో కాదు.
కాంతార సినిమా హీరోయిన్ సప్తమి గౌడ. తాజాగా ఈ నటి ఓ యువ హీరో భార్యపై పరువు నష్టం కేసు వేసింది. ఉద్దేశపూర్వకంగా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మీడియాలో తన పరువు తీస్తున్నారంటూ సప్తమి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల వల్ల తన పరువుకి భంగం వాటిల్లిందని పేర్కొంటూ రూ.10 కోట్లకి దావా వేసింది నటి సప్తమి గౌడ.

కాంతారా సినిమాతో నటి సప్తమి గౌడ మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది. అయితే, ఇటీవలే ఆమె యువ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కన్నడ్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ సోదరుడి కొడుకు యువ రాజ్‌కుమార్ హీరోగా చేశాడు. ఇటీవల హీరో రాజ్‌కుమార్ తన భార్య శ్రీదేవి నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వార్త కాస్త ఇండస్ట్రీలో దుమారం రేపింది.
విడాకుల నోటీసులు పంపిన నాటి నుంచి ఆయన భార్య మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తమ విడాకుల వివాదానికి కాంతార హీరోయిన్ సప్తమి గౌడ కారణమంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త యువరాజ్ సప్తమితో సంబంధం పెట్టుకున్నాడంటూ శ్రీదేవి ఆరోపించింది. ఇదే విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూ లలో కూడా చెప్పింది. దాంతో ఆగ్రహించిన నటి సప్తమి. తనపై తప్పుడు ఆరోపరణలు చేశారంటూ శ్రీదేవిపై ఏకంగా రూ. 10 కోట్ల పరువునష్ట కేసు వేసింది. తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా తన భార్య శ్రీదేవి వేధింపుల వల్లే తను విడాకుల నోటీసులు పంపించానంటూ యువ హీరో రాజ్‌కుమార్ మీడియా ముఖంగా వివరించారు.












Click it and Unblock the Notifications