అతన్ని మర్చిపోలేకపోతున్నా.. తెలుగు హీరోయిన్ సంచలనం
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్‌లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తరువాత యూత్‌ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రామ్, నాగ చైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం నాలుగైదు సినిమాలకుపైగానే అనుపమ చేతిలో ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతోంది. అనుపమ అంటే యూత్ పడిచచ్చి పోతారంతే. మిలియన్ల సంఖ్యలో అమ్మడను ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

టిల్లు స్క్వేర్‌తో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన స్క్వేర్‌లో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. సిద్దు జోన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. గతంలో ఎన్నడు లేనంత హాట్‌గా కనిపించి అభిమానులకు షాకిచ్చింది.
టిల్లు స్క్వేర్‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. సిద్దు జోన్నలగడ్డతో లిప్ లాక్‌లతో అమ్మడు రెచ్చిపోయింది. ఆ సినిమా విడుదల సమయంలో ఎక్కడ చూసిన కూడా అనుపమ చేసిన రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగింది. తాజాగా బెల్లంకొండ హీరోతో నటించిన కిష్కిందపురి సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనుపమ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
నా స్నేహితుడితో చిన్న మనస్పర్థల కారణంగా కొంతకాలం మాట్లాడలేదు. అతని మెసేజ్‌లకు కూడా రిప్లై ఇవ్వలేదు. చాలా రోజుల తర్వాత అతను నన్ను చూసి మెసేజ్ చేశాడు. నేను చూసినా స్పందించలేదు. కానీ రెండు రోజుల తర్వాత అతను చనిపోయాడని తెలిసింది. ఆ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అనుపమ కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ సంఘటన నుంచి ఆమె ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నానని తెలిపారు. మనల్ని ప్రేమించే వారితో వచ్చిన చిన్న విరోధాలు కూడా జీవితంలో తీరని బాధను మిగల్చగలవని ఈ సంఘటన ద్వారా ఆమెకు అర్థమైంది. స్నేహాలు, బంధాలు ఎంతో విలువైనవని, వాటిని ఎల్లప్పుడూ గౌరవంతో కాపాడుకోవాలని ఆమె గుర్తు చేశారు. ఈ సంఘటనను తాను జీవితంలో మర్చిపోలేనని, ఇప్పటికీ అతని జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతుంటానని అనుపమ వివరించారు.












Click it and Unblock the Notifications