'పుష్ప2' లో వైఎస్ జగన్ డైలాగులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం పుష్ప2. మొదటి భాగం అనూహ్యమైన విజయం సాధించడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులోకన్నా హిందీలోనే అధికంగా అంచనాలున్నాయంటే అక్కడి ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మొన్నటివరకు బన్నీ సినిమా విడుదలవుతోంది అంటే మెగా అభిమానులు ఒకటే సందడి చేసేవారు. నానా హడావిడి చేసేవారు. కానీ ఇప్పుడు వారంతా మౌనంగా ఉన్నారు. కొన్నాళ్ల నుంచి మెగా అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య, అల్లు అర్జున్ అభిమానుల మధ్య హోరాహోరీగా సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

బన్నీని తమవాడిగా భావిస్తున్న వైసీపీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తుండటంతో మద్దతుగా నంద్యాల వెళ్లాడు. నిబంధనలకు విరుద్ధంగా చిన్న ర్యాలీ జరిగింది. దీనిపై కేసు నమోదైతే ఇటీవలే హైకోర్టు దీన్ని కొట్టేసింది. వైసీపీ అభ్యర్థి తరఫున వెళ్లాడు కాబట్టి అప్పటి నుంచి మెగా అభిమానులకు, బన్నీ అభిమానులకు పడటంలేదు. దీనిపై తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. అప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ ను తమ హీరోగా భావిస్తున్నారు. పుష్ప2 సినిమాకు వైసీపీ కార్యకర్తలే ఎక్కువ హడావిడి చేస్తున్నారు.

ap ex cm ys jagan famous dialogues in Pushpa2 movie video viral in social media

బన్నీ డైలాగు.. జగన్ డైలాగు
తాజాగా పుష్ప2 ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ ఒక డైలాగు చెబుతాడు. నాకు రావాల్సింది ఏడుకొండల అవతల ఉన్నా.. ఏడు సముద్రాలు దాటివున్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి స్టైల్ అంటూ చెబుతాడు. సరిగ్గా ఇదే డైలాగును వైసీపీ అభిమాని ఒకరు జగన్ చెప్పిన డైలాగుతో పోల్చి ఎడిట్ చేశాడు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై జగన్ స్పందిస్తూ అరెస్ట్ చేస్తున్న పోలీసులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సముద్రాల అవతల ఉన్నా అరెస్ట్ చేసి తీరతాం అంటూ వ్యాఖ్యానించారు. ఈ డైలాగును, పుష్ప2లో బన్నీ డైలాగుతో పోలుస్తూ తయారుచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప2 విడుదలైనప్పుడు బన్నీ అభిమానులకన్నా వైసీపీ అభిమానుల హంగామానే ఎక్కువగా ఉండబోతోందని దీంతో అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+