ఎదురుపడ్డ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, సాయి ధరమ్ తేజ్..ఏం జరిగిందంటే..?
గత కొద్దికాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం అల్లు అర్జున్ అనే విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా ,అల్లు కుటుంబాల మధ్య మాటల్లేవనే చర్చ సాగుతోంది.పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఎన్నికల ఫలితాల సమయంలోనే హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను బ్లాక్ చేశారనే ప్రచారం జరిగింది. దీనిపై ఇరువురు హీరోలు స్పందించలేదు. ఇక ఇదే సమయంలో మెగా కుటుంబంలోని ఆడవారి మధ్య కూడా మాటల్లేవనే చర్చ జరిగింది. జులై 20న మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు. లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మి ప్రణతి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటు స్నేహారెడ్డి పుట్టిన రోజు నాడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు ఎవరూ విషెష్ చెప్పలేదు. దీంతో రెండు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని అంతా భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications