నాగచైతన్య-శోభిత మూడేళ్లకే విడిపోతారు.. ఆమే కారణం: వేణుస్వామి
ఎట్టకేలకు మన్మథుడు అక్కినేని నాగార్జున ఇంట్లో శుభకార్యం జరిగింది. పెద్దకొడుక్కి పెళ్లి చేయాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించాయి. నాగచైతన్యకు అతను ప్రేమించిన అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేశారు. వివాహానికి సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ విషయమే సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా మారింది. వీరిపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలను చెప్పే జ్యోతిష్యుడు వేణుస్వామి రంగప్రవేశం చేశారు. నిన్న(గురువారం) చెప్పినట్లుగానే ఈరోజు (శుక్రవారం) తన సోషల్ మీడియా ఖాతాద్వారా వీడియో విడుదల చేశారు.
జాతకం బాగోలేదని తేల్చిన వేణుస్వామి
శోభిత జాతకాన్ని బాగా పరిశీలించానని, ఆమె జాతకం అసలు బాగోలేదని తేల్చేశారు. వీరికి నిశ్చితార్థం జరిగిన సమయం, ముహూర్తం, పుట్టిన నక్షత్రం ప్రకారం నాగచైతన్య-శోభిత కలిసివుండరని, విడిపోతారని చెప్పారు. నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు జరిగిందని, ఈ ముహూర్తం ఎలాంటిది అని అడిగితే ఎవరైనా చెబుతారని వేణుస్వామి వ్యాఖ్యానించారు. నాగచైతన్యది కర్కాటక రాశి అని, శోభితది ధనుస్సు రాశి అని, చైతూకు ఆరు, శోభితకు ఎనిమిది వచ్చాయని దీనివల్ల ఇద్దరి జాతకాల్లో షష్టకాలు వచ్చాయన్నారు.

ముహూర్తం బాగోలేదు
వీరిద్దరి జాతకం కలవకపోవడమే కాకుండా నిశ్చితార్థం కోసం అనుకున్న ముహూర్తం కూడా అసలు బాగోలేదని వేణుస్వామి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. చైతూకు, సమంతకు తాను 100కు 50 మార్కులిస్తానని, అదే చైతూకు, శోభితకు అయితే కేవలం 100కు 10 మార్కులిస్తానన్నారు. 50 మార్కులిచ్చిన సమంత విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారని, పది మార్కులిచ్చిన శోభిత విషయంలో ఏం జరగబోతుందో అర్థం చేసుకోవాలన్నారు. సమంత, శోభిత జాతకాల్లో శని దృష్టి కుజుడిమీద, గురుడుమీద, శుక్రుడిమీద ఉందని, 2027 నుంచి వీరిమధ్య సమస్యలు ప్రారంభమవుతాయన్నారు. ఆ తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయని, అందుకు కారణం ఓ స్త్రీ అని వేణుస్వామి చెప్పారు.
అఖిల్ అప్పుడు ఇదే చెప్పా
అఖిల్ నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా తాను ఇదే విషయం చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని, చైతూ, శోభిత కలిసివుండే అవకాశమే లేదన్నారు. తన జాతకం తప్పుకావాలని తాను కూడా కోరుకుంటున్నానన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని, కెరీర్ పరంగా సమంత జాతకం 100 శాతం బాగుందని, శోభితది మాత్రం 20 శాతమే బాగుందన్నారు.












Click it and Unblock the Notifications