Ayodhya ram pran pratishtha: సీతారాముడిలా రాం చరణ్, ఉపాసనల ఫోటో వైరల్!!

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. దేశవ్యాప్తంగా సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాములవారు అయోధ్యలో తిరిగి ప్రజలకు దర్శనమిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

ఇక అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శ్రీరాముని ఫోటోలతో విషెస్ జోరుగా సాగుతున్నాయి. ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ ఏది చూసినా అయోధ్య రామాలయం తాలూకు ఫోటోలే దర్శనమిస్తున్నాయి. భారతదేశమంతటా రామనామ స్మరణ మారుమోగుతున్న వేళ, ఎక్కడ చూసినా జైశ్రీరామ్ నినాదాలతో భక్తి పరవశం కనిపిస్తుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించిన క్రమంలో, ఆహ్వానం అందుకున్న దాదాపు ప్రముఖులందరూ అయోధ్యకు చేరుకున్నారు.

అలా అయోధ్యకు వెళ్ళిన వారిలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఉన్నారు. చిరంజీవి, సురేఖ లతోపాటు రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా అయోధ్య రాములవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. అయోధ్య రామయ్య దర్శనానికి వెళుతున్న క్రమంలో వీరంతా ఇది చాలా ప్రత్యేకమైన రోజుగా, చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.

అయితే ఈ ప్రత్యేకమైనటువంటి రోజును పురస్కరించుకొని మెగా ఫాన్స్ అయోధ్య ఆలయం ముందు రాంచరణ్ ఉపాసన దంపతుల ఫోటోలను, ఏఐ టెక్నాలజీలో సీతారాముల మాదిరిగా తీర్చిదిద్ది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ సీతారాముడులా ఉన్నారని, వారు కలకాలం ఇదే విధంగా జీవించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో వీళ్ళు బెస్ట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సహజంగా ఏఐ టెక్నాలజీని సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టేందుకే ఉపయోగిస్తున్న క్రమంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులను సీతారాముడు లాగా తీర్చిదిద్దడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ayodhya ram pran pratishtha: Ram charan and Upasana AI photo viral!!

ఏఐ టెక్నాలజీతో ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇబ్బందికరమైన విధంగా వారి ఫోటోలు, వీడియోలు పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయోధ్య శ్రీరామ మేనియా ఉన్నవేళ రామ్ చరణ్ ఉపాసన దంపతులను సీతారాముడు లాగా మార్ఫ్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+